19.3.26

చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండరాముడు chinna sesah vahanam

 











తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.


గజరాజులు ముందు కదులుతుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుందిభగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.


అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెపసుపుచందనంకొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నఏఈవో శ్రీ రవిటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments