తిరుపతి
శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై నిర్వహించిన భక్తి, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా టీటీడీ ఎస్వి సంగీత నృత్య కళాశాల, నాదస్వర మరియు డోలు పాఠశాల ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు గాత్రం, వాద్యం, నృత్యం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 7:15 వరకు ఎస్వి నాదస్వర & డోలు పాఠశాల అధ్యాపకులు శ్రీ ఎస్.మునిరత్నం బృందం " ప్రణమామ్యహం, సీతమ్మ మాయమ్మ, ఉపచారము, అమ్మ రావమ్మా, బ్రోచేవారెవరే, రామచంద్రుడితడు అను కృతులు ఆలపించారు. తదుపరి రాత్రి 7:15 నుంచి 8:30 వరకు జరిగిన భరతనాట్య నృత్య కార్యక్రమంలో భాగంగా శ్రీ ఎం శ్రీనివాస్ & శ్రీమతి ధనశ్రీ బృందం " పుష్పాంజలి గణేష స్తుతి, నటేషా కౌతం, నవరస వర్ణం, రామభద్ర రారా " అను అంశాలు అద్భుత నృతం ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల పర్యవేక్షిస్తున్నారు.
No comments :
Write comments