18.3.26

టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు : టిటిడి జేఈవో డా. ఎ. శరత్ ttd jeo






టీటీడీ విద్యాసంస్థల్లో వచ్చే ఏడాది నుండి మరిం నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని టిటిడి జేఈవో (వైద్యంవిద్డాశరత్ సూచించారుమంగళవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో డీఈవో శ్రీ వెంకట సునీలుటిటిడి కళాశాలలుపాఠశాలల ప్రిన్సిపాల్స్‌హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుటిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మార్గదర్శకత్వంలో విద్యాసంస్థల్లో పలు ర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు జ్ఞానంనైపుణ్యాలువిలువలను పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కలిసి పని చేయాలని తెలిపారు.


విద్యార్థుల చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పర్యవేక్షణమార్గదర్శకత్వంప్రత్యేక శ్రద్ అవసరమని సూచించారువిద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా గ్రూపులుగా విభజించిప్రతి గ్రూపులో అన్ని రకాల విద్యార్థులు ఉండేలా చూసిమంచి ప్రతిభ కలిగిన వారు ఇతరులకు సహాయం చేసే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.


విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధించాలనిచదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునిఉపాధ్యాయులు పాఠాలు మరింత బాగా బోధిస్తే పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించవచ్చని తెలిపారుఅలాగే ఉపాధి ఆధారిత కోర్సులుకొత్త విద్యా విధానంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.


వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సకాలంలో నవీకరించాలన్నారుడిజిటల్ బోధన పద్ధతులుస్మార్ట్ క్లాసులు పయోగించాలనిముందుగానే లెసన్ ప్లాన్ సిద్ధం చేసి బోధించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారువిద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ తో పాటు వారి పురోగతిని నిరంతరం నమోదు చేయాలన్నారువిద్యార్థులువారి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించివిద్యార్థుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.


డోలు విద్యార్థిని అభినందించిన జేఈవో


ఎస్వీ మ్యూజిక్ కాలేజీకి చెందిన శ్రీ కెప్రదీప్ జాతీయ స్థాయి డోలు వాయిద్య పోటీల్లో ప్రథమ హుమతి సాధించినందుకు జేఈవో అభినందించారుచెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో జరిగిన  పోటీల్లో దేశవ్యాప్తంగా 150 విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారుప్రదీప్‌కు డోలు వాయిద్యంలో శిక్షణను హెచ్‌ఓడీ శ్రీ వైఎల్శ్రీనివాస్ అందించారు.


 కార్యక్రమంలో  ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డిఎస్జీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నారాయణమ్మఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి భువనేశ్వరి, ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మావతమ్మఎస్వీ మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమ ముద్దుల తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments