తిరుపతిలోని
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించి, గరుడ పటాన్ని అవతరింపజేశారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. అలాగే విషమృత్యు నాశనం కలిగి, రాజ్యపదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments