26.3.26

మార్చి 26న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మార్చి 27న ధ్వజారోహణంతో మహోత్సవాల ప్రారంభం ankurarpanam




ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది ఆలయం పురాతనచారిత్రక ప్రాశస్త్యం కలిగినదిఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టితమై ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలా నగరంగా కూడా పిలుస్తారు.


మార్చి 26 నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.


 సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారుఅనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకంఆరాధనఅర్చనలు నిర్వహిస్తారు.


సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ శాస్త్రోక్తంగా జరుగుతుందిఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజకలశ ప్రతిష్టకలశ పూజవాసుదేవ పుణ్యాహవచనంకంకణధారణ నిర్వహిస్తారుఅనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


మార్చి 27 ధ్వజారోహణం


మార్చి 27 తేదీన ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయిఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.


అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి ఆస్థానంసాయంత్రం 4 గంటలకు శ్రీ పోతన జయంతికవిసమ్మేళనం నిర్వహించనున్నారురాత్రి నుండి 9 గంటల వరకు శేష వాహనసేవపై స్వామిఅమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

No comments :
Write comments