వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్ర
హ్మోత్సవాల్లో
భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు కటాక్షం ప్రసాదించారు.
గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా, భజన బృందాలు రామనామ స్మరణతో కోలాటాలు ఆడుతూ స్వామివారిని అనుసరించాయి. ఈ సందర్భంగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు.
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై స్వామివారు భక్తులకు చల్లని కటాక్షం ప్రసాదిస్తారు. జ్యోతిషశాస్త్రంలో ముత్యం చంద్రునికి ప్రతీకగా భావించబడుతుంది. సముద్రం మనకు ప్రసాదించిన అమూల్యమైన వస్తువుల్లో ముత్యం ఒకటి. ముత్యాల పందిరి కింద స్వామివారి దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి వారి జీవితాల్లో శాంతి, చల్లదనాన్ని ప్రసాదిస్తుందని పండితులు తెలిపారు.
రాత్రి 8 గం.లకు శ్రీ పట్టాభిరాముడు హనుమంత వాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదిస్తారు.
ఈ వాహనసేవలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, నాగరాజు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments