19.3.26

హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం hamsa vahanam





తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం రాత్రి 7 గంట‌ల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు.


గజరాజులు ముందు కదులుతుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందిహంస వాహనంలోని పరమార్థం ఇదేహంసలో పాలనునీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉందిభక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిడెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments