29.3.26

హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల క‌టాక్షం hamsa vahanam








ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 గంటల నుండి హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులను క‌టాక్షించారు.


భక్తజన బృందాల చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందిహంస వాహనంలోని పరమార్థం ఇదేహంసలో పాలనునీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉందిభక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ప్రశాంతిసూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌టెంపుల్‌ న్‌స్పెక్టర్ శ్రీ న‌వీన్ తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments