18.3.26

శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం koil alwar tirumanjanam







తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 19 తేదీన ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జ‌రిగింది.


 సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు మీడియాతో మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.


టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సాధారణంగా ఉగాదిఆణివార ఆస్థానంబ్రహ్మోత్సవాలువైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారుస్వామివారి మూలవిరాట్టును స్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని చెప్పారు.


కాగా  ఆగమ ప్రక్రియలోనామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర ''పరిమళ'' జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజనైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారునంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.


 కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులుజేఈవో (విద్య&వైద్యండాక్టర్ శరత్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments