13.3.26

అలిపిరి వద్ద భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన టీటీడీ ఈవో luggage counter






తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పనితీరును టీటీడీ ఈవో శ్రీ ఎంరవిచంద్ర పరిశీలించారుటిటిడి సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ తో కలిసి గురువారం టిటిడి ఈవో తనిఖీలు నిర్వహించారు


భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగావాటిని భద్రంగా తిరుమలకు తరలించే విధానంపై అధికారులు ఈవోకు వివరించారులగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రూపొందే క్యూఆర్ కోడ్‌తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు.


సాధారణ రోజుల్లో సుమారు 6 వేల బ్యాగులుప్రత్యేక పర్వదినాల్లో 10 వేల వరకు బ్యాగులు తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.


అనంతరం ఈవో లగేజి కౌంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించిభక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.


 కార్యక్రమంలో అలిపిరి ఏవిఎస్వో శ్రీ రమేష్ కృష్ణన్ మరియు ఇతర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments