ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం అన్నదానం ట్రస్ట్ కు రూ.1,01,116 విరాళం గురువారం అందింది.
ఈ మేరకు అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండల కేంద్రానికి చెందిన స్థానిక వ్యాపారి శ్రీ ఎస్. వెంకట రత్నమయ్య, శ్రీ ఎస్. సుభద్రమ్మ దంపతులు విరాళం డిడిని టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంకు ఒంటిమిట్టలోని టిటిడి సమావేశ మందిరంలో అందించారు.
ఈ సందర్భంగా దాతను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అన్నదానం ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రి, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ శివప్రసాద్, శ్రీ సెల్వం తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments