29.3.26

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం • బంగారు గజ లక్ష్మీ పతకం, వెండి దీప స్తంభాలు బహుకరణ sita rama kalyanam












తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ‌నివారం రాత్రి శ్రీ‌ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా  జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణంలో టీటీడీ ఈవో శ్రీ  ఎం రవిచంద్ర పాల్గొన్నారు.


ముందుగా అర్చకులు పుణ్యాహవచనంసద్యో అంకురార్పణరక్షాబంధనంవిశేషారాధన చేశారు తరువాత రక్షాబంధనఅగ్నిప్రతిష్ఠమధుపర్కం, కన్యాదానంమహాసంకల్పంస్వామిఅమ్మవారికి ప్రవరలుమాంగళ్యపూజ చేపట్టారుఅనంతరం మాంగళ్యధారణఉక్తహోమాలుపూర్ణాహుతి, నివేదనఅక్షతారోహణంముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌విశేష నివేద‌న‌మాల‌మార్పిడిఅక్ష‌తారోహ‌ణ‌హార‌తిచ‌తుర్వేద పారాయ‌ణంయ‌జ‌మానికి వేద ఆశీర్వాదంహారతి ఇచ్చారుకల్యాణం అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.


 శ్రీవారి ఆలయం నుండి బంగారు ఆభరణాలు బహుకరణ : 


తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక బంగారు గజ లక్ష్మీ పతకంరెండు వెండి దీప స్తంభాలు రూ. 62.44 లక్షలు విలువ చేసే ఆభరణాలు బహుకరించారు.  


తిరుమల నుండి పెష్కార్ రామకృష్ణబొక్కసం ఇంఛార్జి శ్రీ గురురా స్వామి తీసుకువచ్చి ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు.


 కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్‌విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments