14.3.26

ఎన్నో జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లంతోనే వైదిక విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం శ్రీ శృంగేరీ శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ విధుశేఖ‌ర భార‌తి స్వామీజీ=srungeri sarada peetham






ఎన్నో జ‌న్మ‌ల్లో పుణ్యం చేసుకుంటేగానీ వైదిక విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం క‌ల‌గ‌ద‌ని శ్రీ శృంగేరీ శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ విధుశేఖ‌ భార‌తి స్వామీజీ తెలియ‌జేశారుతిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వ‌ద్ ఉన్న శ్రీ‌వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంలో ఆరు రోజుల పాటు నిర్వ‌హించిన 29వ‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులో చివ‌రిరోజైన శుక్ర‌వారం స‌మాప‌నోత్స‌వానికి (విజ‌యోత్స‌వానికివిశిష్ట అతిథిగా ఆయ‌న విచ్చేశారు.


 సంద‌ర్భంగా ఆయ‌న వేద విద్యార్థుల‌ను ఉద్దేశించి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ ధ‌ర్మ‌మే స‌మ‌స్త ప్ర‌పంచానికి ఆధార‌మ‌నివైదికమార్గం ద్వారానే ప్ర‌పంచ శ్రేయ‌స్సు ల‌భిస్తుంద‌ని చెప్పారుప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌లక్షేత్రంలో ఉన్న వేద విజ్ఞాన పీఠం ప్రాచీన కాలం నుండి వేద‌శాస్త్రఆగ‌ విద్య‌ల‌కు సంజీవ‌నిగా నిలుస్తోంద‌న్నారు.


వైదిక విద్య చాలా ఉత్కృష్ట‌మైన విద్య అనిఅన్ని ప్ర‌మాణాల్లో వేదాలే స‌ర్వ శ్రేష్ట‌మైన‌వి అని తెలిపారువైదిక విద్య‌కు ఆచారంసాంప్ర‌దాయ‌మే ముఖ్య‌మ‌ని చెప్పారువైదిక విద్య‌ను అభ్య‌సించిన వారిని స‌మాజం మొత్తం గౌర‌వించాల‌ని తెలియ‌జేశారు.


అనంత‌రం ఆయ‌న ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన 313 మంది విద్యార్థుల‌ను స‌న్మానించి విజ‌య ప‌త్రిక‌ల‌ను ప్ర‌దానం చేశారు.


కాగా వేద‌శాస్త్రఆగ‌మాల్లోని 37 విభాగాల్లో దేశ‌వ్యాప్తంగా 412 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వ్వ‌గా 313 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారువీరిలో 202 మంది ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణుల‌వ్వ‌గా, 111 మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుల‌య్యారు.


 కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధానిఇత‌ర పండితులు పాల్గొన్నారు.

No comments :
Write comments