8.3.26

టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – పేదల ప్రాణాలకు వరం sv pranadana trust




తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ఆధ్వర్యంలోని టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ పేద వర్గాల ప్రాణాలకు వరంగా నిలుస్తోందిరాయలసీమ జిల్లాలలో గుండెమూత్రపిండాలుక్యాన్సర్న్యూరో సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఖరీదై వైద్య చికిత్సలను ఉచితంగా అందించాలనే దివ్యసంకల్పంతోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ప్రాణదా ట్రస్ట్ ను 2001 అక్టోబర్ 01 ప్రారంభించారు.


 మహోన్నత సేవా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో కొనసాగుతూపేద రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది.


దీర్ఘకాలిక వ్యాధులకు సహాయం


 ట్రస్ట్ ద్వారా దీర్ఘకాలిక మరియు నిర్ధిష్ట వ్యాధుల చికిత్సతో పాటు వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయిముఖ్యంగా – దీర్ఘకాలి మూత్రపిండాల వైఫల్యంహీమోఫిలియాథలసేమియాక్యాన్సర్గుండె జబ్బులునాడీ సంబంధిత వ్యాధులుఅటాక్సియాకొరియాహెమిబాలిస్మస్అఫాసియా వంటి న్యూరోలాజికల్ తదితర వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉపశమనం కలిగేలా ప్రణాళికాబద్ధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారుపేద రోగులకు వైద్య ఖర్చులుశస్త్రచికిత్సలుకృత్రిమ అవయవాలుఇంప్లాంట్లుబ్లడ్ బ్యాంక్ లాంటి వైద్ సేవలను ఎలాంటి వివక్ష లేకుండా  అందిస్తున్నారు.


ఆర్థిక సహాయం పెంపు


పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ నుండి వివిధ దశల్లో నిధులను పెంచుతూ వచ్చారు: 22.02.2003 తేదీ నుండి నెలకు రూ. 15 లక్షలు, 30.04.2005 – రూ. 25 లక్షలు, 24.03.2006 – రూ. 30 లక్షలు, 30.01.2008 – రూ. 50 లక్షలు,  02.04.2014 – నెలకు రూ. 1 కోటి ఖర్చు చేస్తున్నారు.


దాతల సహకారం


ఎస్వీ ప్రాణ దాణ ట్రస్ట్ కు ఇప్పటి వరకు 51,957 మంది దాతలు దాదాపు రూ. 520 కోట్లును విరాళాలను అందించారు.


2001, నవంబర్ నుండి 2026, ఫిబ్రవరి వరకు దాదాపు రూ. 158 కోట్ల ఖర్చుతో సుమారు 27,710 పైచిలుకు రోగులు  ట్రస్ట్ ద్వారా వైద్య సేవలను పొందారు.


ఎంపిక విధానం


దారిద్య్ర రేఖకు దిగువనున్న రోగులను ఎస్వీ ప్రాణదాన ఎంపిక కమిటీ పరిశీలించి ఉచిత చికిత్సకు ఎంపిక చేస్తుందికన్సల్టెంట్ వైద్యుడు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారుఆరోగ్య కార్డులుఅధికా రికార్డులు పరిశీలిస్తారుచికిత్స ఖర్చు అంచనా వేసి ఆమోదం పొందిన తర్వాత వైద్య సేవలు అందిస్తారుస్విమ్స్ డైరెక్టర్ కమ్ వీసీ ద్వారా పంపిన కేసులను డాఎన్.టి.ఆర్వైద్య సేవా ట్రస్ట్ పోర్టల్‌లో తనిఖీ చేసి నమోదు చేస్తారుఅత్యవసర కేసుల్లో తక్షణ ధృవీకరణతో చికిత్స అందిస్తారు.


ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – రక్తదాన సేవల విస్తరణ


2007లో ప్రారంభమైన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ రక్తదాన సేవలను విస్తృతంగా అమలు చేస్తోందిఉచిత రక్తం మరియు రక్త భాగాల పంపిణీ, స్వచ్ఛంద రక్తదాన ప్రోత్సాహంఅత్యవసర సేవలుప్రజల్లో అవగాహన కార్యక్రమాలుటిటిడి పరిధిలోని రక్తనిధుల ద్వారా సేకరించిన రక్తాన్ని పూర్తిగా ఉచితంగా అందించడం  ట్రస్ట్ ప్రత్యేకతముఖ్యంగా గర్భిణీ స్త్రీలుప్రమా బాధితులుగుండె శస్త్రచికిత్ రోగులుథలసేమియా చిన్నారులు, అత్యవసర శస్త్రచికిత్స రోగులకు తక్షణ సహాయం అందిస్తూ అనేక ప్రాణాలను కాపాడుతోంది.


భక్తుల భాగస్వామ్యం


ఒక యూనిట్ రక్తం – మూడు ప్రాణాలకు ఆశ” అనే నినాదంతో యువతను రక్తదానానికి ప్రేరేపిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుతిరుమలకు విచ్చేసే భక్తులు తమ ర్శన యాత్రను రక్తదానంతో మరింత పుణ్యమయంగా మార్చుకుంటున్నారుటిటిడి పర్యవేక్షణలో నడిచే  ట్రస్ట్ పూర్తిస్థాయి పారదర్శకతతో సేవలను అందిస్తోందిరక్త సేకరణనిల్వపరీక్షలుపంపిణీ ప్రక్రియల్లో జాతీయ వైద్య ప్రమాణాలను  పాటిస్తోంది.


సమాజానికి సందేశం


ప్రాణదానం అనేది పరమదానంఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడగలదుఒకరి ఆర్థిక సహాయం మరొకరి ప్రాణాలకు ఆధారం అవుతుందనే సేవ దృక్పథంతో వైద్య సేవలను అందిస్తున్నారుశ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో కొనసాగుతున్న  ప్రాణదాన సేవలు మరింత విస్తరించిరెన్నో పేద కుటుంబాలకు వెలుగులు నింపేందుకు టిటిడి కృషి చేస్తోంది.

No comments :
Write comments