VIDEO
ఒంటిమిట్టలోని
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగ నున్న వార్షిక బ్రహ్మోత్సవాల సం దర్భంగా విచ్చేసే భక్తులకు సౌ కర్యవంతమైన సేవలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్ తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలె క్టర్ డా . చెరుకూరి శ్రీధర్ అధి కారులను ఆదేశించారు .
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పా ట్లపై సోమవారం ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో సమీక్ష సమావేశం ని ర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ, ముఖ్యంగా శ్రీరామనవమి మరియు శ్రీ సీతారాముల కళ్యాణో త్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భద్రత , పార్కింగ్, అన్నప్రసాదాల పంపి ణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, ని రంతరాయ విద్యుత్ సరఫరా, ప్రథమ చి కిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సు లు, హెల్ప్ డెస్కులు, సూచిక బో ర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి అన్ని విభా గాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళి కతో పనిచేయాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల్లో తెలుగు సంప్ రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలం కరణలు : టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్ సవాలకు తెలుగు సంప్రదాయం ప్రతి బింబించేలా ప్రత్యేక అలంకరణలు చే పట్టాలని ఆయన సూచించారు. ఏప్రి ల్ 1 న జరిగే శ్రీ సీతారాముల కళ్ యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమం త్రి శ్రీ నారా చంద్రబాబు నాయు డు పట్టు వస్త్రాలు సమర్పించను న్నట్లు తెలిపారు.
భక్తులను ఆకట్టుకునే విధంగా వి ద్యుత్ మరియు పుష్పాలంకరణలు చే యాలని సూచించారు.
అలాగే కళ్యాణ వేదిక వద్ద గ్యా లరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాం టి అసౌకర్యం కలగకుండా శ్రీవారి సేవకులు, పోలీస్ సిబ్బంది, టీటీ డీ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయా లని చెప్పారు.
వేసవి దృష్ట్యా కళ్యాణ వేదిక వద్ద నీటితో పిచికారీ చేయాలని, వడదె బ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్ తలు తీసుకోవాలని సూచించారు. స్ థానిక అధికారులతో సమన్వయం చేసు కుని పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్ నారు. పార్కింగ్ సమస్యలు లేకుం డా పోలీసులతో సమన్వయం చేసుకోవా లని తెలిపారు.
గ్యాలరీల్లో నిర్వహణ పటిష్టంగా ఉండాలని, ప్రతి గ్యాలరీలో అన్ నప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులు మరియు సంబంధిత అధికారి ని ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్ యాలు ప్రణాళికాబద్ధంగా అందేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు.
మార్చి 26 న అంకురార్పణతో కార్ యక్రమాలు ప్రారంభమై, మార్చి 27 న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రా రంభమవుతాయని టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్ మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీ గా అధికారులు సమన్వయం చేసుకోవా లని సూచించారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ ట భద్రత : సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాని కి వచ్చే భక్తులకు పోలీసుల సమన్ వయంతో పటిష్ట భద్రతా చర్యలు చే పడుతున్నామని టిటిడి సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తు లకు సమస్యలు తలెత్తితే వెంటనే స్పం దించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్ రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచిం చారు. విధుల్లో ఉన్న సిబ్బంది, శ్రీవారి సేవకులు ఈ నెంబర్ ద్వా రా సేవలు అందించాలని కోరారు.
ఈ సమావేశంలో పలువురు జిల్లా అధి కారులు, టీటీడీ సీఈ శ్రీ సత్యనా రాయణ, ఎస్. ఈలు శ్రీ మనోహరం, శ్ రీ వేంకటేశ్వర్లు, శ్రీ నరసిం హమూర్తి, డిప్యూటీ ఈవోలు శ్రీ సె ల్వం, శ్రీ శివప్రసాద్, అన్నప్ రసాదం ప్రత్యేక అధికారి శ్రీ జి . ఎల్. ఎన్. శాస్త్రి తదితర అధికా రులు పాల్గొన్నారు.
No comments :
Write comments