8.4.26

ఒంటిమిట్ట కల్యాణోత్సవం రోజున 1.25 లక్షల భక్తులకు అన్నప్రసాదం vontimkitta








ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి భక్తులకు విశేషంగా అన్నప్రసాదాలను అందించి తన సేవా స్పూర్తిని మరొకసారి చాటుకుందిముఖ్యంగా ఏప్రిల్ 1 తేదీన నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 1.25 లక్షల పైచిలుకు భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేయడం విశేషం.


శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు ఒంటిమిట్టకు రలివచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందేలా టిటిడి సమగ్ర ర్పాట్లు చేసిందిఆలయ సమీపంలోని అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు కల్యాణ వేదిక వద్ద ఉద్యోగు సౌకర్యార్థం కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమర్థవంతంగా పంపిణీ చేశారు.


కల్యాణోత్సవం రోజున భక్తులకు పులిహోరరవ్వ కేసరిమైసూర్ పాక్కారాలుబిస్కెట్ ప్యాకెట్రటిపండువాటర్ బాటిల్టెట్రా ప్యాకెట్మజ్జిగలను ఒకే బ్యాగ్‌లో అందజేసి సౌకర్యవంతమైన సేవను అందించారు.


అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తం కాలంలో ప్రతిరోజూ భక్తులకు ఉదయం పొంగలిఉప్మాసాంబర్చట్నీ, మధ్యాహ్నంరాత్రి సమయాలలో  అన్నంచెక్కెర పొంగలికూరచట్నీసాంబర్రసంమజ్జిగలను వడ్డించారు.


మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు రోజువారీగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించగావివరాల ప్రకారం — మార్చి 27 30,700, 28 22,900, 29 23,900, 30 22,300, 31 26,500, ఏప్రిల్ 1 అన్నప్రసాదాలు 40 వేలుకల్యాణోత్సవం సందర్భంగా గ్యాలరీలలో 85 వేల మందిఏప్రిల్ 2 23,500, 3 18,450, 4 15,350, 5 11,400 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.


 విధంగా మొత్తం 10 రోజుల్లో దాదాపు 3.20 లక్షల మంది భక్తులు టిటిడి అన్నప్రసాద సేవలను స్వీకరించారు.

భక్తుల సేవే పరమావధిగా టిటిడి నిర్వహించిన  అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల ప్రశంసలను అందుకుంది.

No comments :
Write comments