24.4.26

కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ ఏప్రిల్ 24 నుండి మే 03 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు sri konetiraya




చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవంశాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారుబ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయిచలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యే శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీటెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మోహన రమణ పాల్గొన్నారు.


ఏప్రిల్ 24 ధ్వజారోహణం :


ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 09.05 గం. నుండి 09.15 గం. మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.  శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 24 నుండి మే 03 తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారుప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకురాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహనసేవలు భక్తులను అలరించనున్నాయి.

వాహనసేవల వివరాలు:


ఏప్రిల్ 24

ఉదయం – ధ్వజారోహణం (మిథున లగ్నంలో . 9.05 నుండి 9.15 వరకు)

సాయంత్రం – శేష వాహనం


ఏప్రిల్ 25

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హంస వాహనం


ఏప్రిల్ 26

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం


ఏప్రిల్ 27

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం


ఏప్రిల్ 28

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవంగరుడ వాహనం


ఏప్రిల్ 29

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవంగజ వాహనం


ఏప్రిల్ 30

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం


మే 01

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వ వాహనం


మే 02

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం


కల్యాణోత్సవం :


ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారురూ.500/- చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చుపాల్గొనే వారికి ఉత్తరీయంరవికెఅన్నప్రసాదం అందజేస్తారు.


మే 03 సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.


ఆధ్యాత్మిక కార్యక్రమాలు:


 బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుఅన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీతఆధ్యాత్మి కార్యక్రమాలు నిర్వహించబడతాయిభక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


No comments :
Write comments