18.4.26

ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట – 4½ సంవత్సరాలకే ఫీజులు : స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీకి ప్రతిపాదనలు svims hospital




స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు


2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులువారి తల్లిదండ్రులు ఇటీవల టిటిడి ఈవోను కలిసి తమ కోర్సు వ్యవధి 4½ సంవత్సరాలు మాత్రమే కావడంతో అదే మేరకు ఫీజులు వసూలు చేయాలని టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్రకు విజ్ఞప్తి చేశారుస్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను 5 సంవత్సరాలకు వసూలు చేస్తున్నట్లు వారు వినతి పత్రం సమర్పించారు.


 అంశాన్ని పరిశీలించిన టిటిడి ఈవోనేషనల్ మెడికల్ కమిషన్ 07-04-2026 జారీ చేసిన నిబంధనలను పరిశీలించిఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కోర్సుకు ఫీజులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు.


 నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చర్చించితగిన ఆమోదం (రాటిఫికేషన్పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు.


ప్రస్తుతం 2021-22బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతోవారికి 5 సంవత్సరాలకంటే 4½ సంవత్సరాలకే ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారుఇదే విధానం కపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూడా అమలు కానుంది.

No comments :
Write comments