29.4.26

న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం alwar tirumanjanam




న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగిందిఆలయంలో మే 1 నుండి 9 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహించారుఉదయం 7.30 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగిందిఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రామాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.


 కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డిటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్శ్రీ ఉదయ్ కుమార్ఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments