తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు.
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఏప్రిల్ 29న అంకురార్పణ :
అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు వసంతోత్సవాలు :
ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఇందుకోసం భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.
ఈ ఉత్సవాల కారణంగా ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజలసేవ, వేద ఆశీర్వచనం మే 1న లక్ష్మి పూజ, కుంకుమార్చన, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments