తిరుమల
శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments