14.4.26

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం bhasyakarula utsavam





తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు  ఉత్సవం జరుగనుందిఏప్రిల్ 22 శ్రీ భాష్యకార్ సాత్తుమొర నిర్వహిస్తారు.


భగవద్‌ రామానుజులు విశిష్టాద్వై సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారుఅందుకే భాష్యకారులుగా పేరొందారుశ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి డాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ సాత్తుమొర నిర్వహిస్తారు.


భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామితిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామిఆల‌య అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments