20.4.26

తిరుమలేశుని భక్తులకు తిరునామధారణ ''తిరునామ''సేవలో తరిస్తున్న శ్రీవారి సేవకులు







తిరు అంటే ‘శ్రీ’, నామం అంటే ‘తిలకం’. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారుహైందవ సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభసూచికంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రతీక


తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగాఅండగా ఉన్నాడన్న భావన కలుగుతుందిసత్ప్రవర్తనతోభక్తిభావంతో మెలగుతారు


ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమై తిరుమలలో ఇలాంటి భక్తిసంప్రదాయాన్ని పెంచేందుకు టిటిడి భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది.


తిరునామంలో ఎర్రటికాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుందికొం మంది భక్తులు భుజాలుఛాతిపైనవీపుపై కింది భాగాన తిరునామం ధరిస్తారుభక్తులు కనుబొమల మధ్ నుంచి నుదుటిపై వరకు ధరిస్తారుతిరునామం ధరించినవారు శ్రీవేంకటేశ్వరుని సేవకులని సులువుగా గుర్తించవచ్చునుదుటన గల ఆగ్నేయచక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడుదృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం


తిరునామం కోసం నామకోపుఎర్రసింధూరం వినియోగిస్తున్నారుతిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరు భక్తుల అభిప్రాయంతిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారుచేసిన కప్పుమూడు నామాల ముద్రను ఉపయోగిస్తారు.


శ్రీవారి ''తిరుమణికాప్పు''


శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడికర్పూరంమధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారుగురువారం సడలింపు(ఆభరణాలు తొలగించేసమయంలో నేత్రాలు  భక్తులకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారుపవిత్రతకు ప్రతీకగా కనిపించే  తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూంటుంది నామాన్ని ‘తిరుమణికాప్పు’ అని అంటారుఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరంఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.


తిరునామ సేవ :


తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ మార్గంశ్రీవాణి దర్శన ప్రవేశ మార్గం,  వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో సర్ దర్శనం భక్తులకుఅదేవిధంగా గొల్ల మండపంరామ్ భగీచా- 3, బేడి ఆంజనేయస్వామి ఆలయంకల్యాణకట్టసుపథం,  వరాహస్వామివారి ఆలయంనాలుగు మాడ వీధులుమాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంసప్తగిరి విశ్రాంతి గృహంజీఎన్సీనందకం విశ్రాంతి గృహంలేపాక్షి సర్కిల్ఏటీజీహెచ్మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిసర ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ జరుగుతోందిఇందుకోసం రోజుకు రెండు షిప్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.


తిరునామం ధరించేందుకు భక్తులు లాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదుశ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

No comments :
Write comments