భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి తో బాటు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ శ్రీ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ మరియు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు.
శ్రీ బేడీ ఆంజనేయ దర్శనం:
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరిజవహర్లాల్ టిటిడి బోర్డు సభ్యులు శ్రీ రామమూర్తి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ జంగా కృష్ణమూర్తి, పలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments