22.4.26

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams





నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


 సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారురాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


వాహన సేవల వివరాలు:


ఏప్రిల్ 22 – సింహ వాహనం

ఏప్రిల్ 23 – హంస వాహనం

ఏప్రిల్ 24 – శేష వాహనం

ఏప్రిల్ 25 – నంది వాహనం

ఏప్రిల్ 26 – గజ వాహనం

ఏప్రిల్ 27 రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.


ఏప్రిల్ 28 రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించిఅనంతరం అశ్వవాహన సేవ ఉంటుందిరూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూఒక అప్పంఅన్నప్రసాదం అందజేస్తారు.


ఏప్రిల్ 29 ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం రుగనుందిసాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.


ఏప్రిల్ 30 కైలాసకోనలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించిఅదేరోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంరాత్రి 7.30 గంటలకు వాహనసేవ నిర్వహించనున్నారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటంఆధ్యాత్మికభక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజుఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఆలయ చరిత్ర


నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి యిన శ్రీ ఆకాశ మహారాజు  ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందిఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారుఅనంతరం శ్రీ అగస్త్య మహర్షులు వేద ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడంతో స్వామివారికి “అగస్తీశ్వరస్వామి” అనే పేరు వచ్చింది.


No comments :
Write comments