29.4.26

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam

 






తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌నశుధ్ధి నిర్వహించారు.


అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారుఅనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


ఏప్రిల్ 29 అంకురార్పణ :


అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు


ఏప్రిల్ 30 నుండి మే 2 తేదీ వరకు వసంతోత్సవాలు :


ఉత్సవాల్లో భాగంగా మే 1 తేదీ దయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుందిసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారురాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.  


ఇందుకోసం భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.


 ఉత్స‌వాల కార‌ణంగా ఏప్రిల్ 30 నుండి మే 2 తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వంఊంజ‌ల‌సేవ‌వేద ఆశీర్వ‌చ‌నం మే 1 లక్ష్మి పూజకుంకుమార్చ‌న‌బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌అర్చకులు శ్రీ బాబుస్వామిసూప‌రింటెండెంట్ శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తిఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments