తిరుచానూరు
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం ప్రత్యేక పూజలతో టిటిడి ప్రారంభించింది.
ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆలయ సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రథమ చికిత్స కేంద్రం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు.
ఈ కేంద్రం ద్వారా భక్తులకు మరియు తిరుచానూరులో పనిచేసే సిబ్బందికి తక్షణ వైద్య సేవలు, ఫస్ట్ ఎయిడ్, సాధారణ చికిత్సలు అందిస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి, అవసరమైతే ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించే ముందు రోగులను స్థిరపరిచే సేవలు అందించనుంది.
ఈ కార్యక్రమంలో సీఎంవో డా.బి. కుసుమకుమారి, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments