18.4.26

నిర్దేశిత గడువులో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి : టిటిడి జేఈవో డా. ఎ. శరత్ ttd jeo





తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతీ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారుశుక్రవారం ఆయ అధికారులతో కలిసి నిర్మాణ పను పురోగతిని పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూప్రతి ఫ్లోర్‌లో ఒక గదిని మోడల్ యూనిట్‌గా అభివృద్ధి చేసి దిలో ఇంజనీరింగ్ఎలక్ట్రికల్ఫైర్ సేఫ్టీమెడికల్ ఎక్విప్‌మెంట్ తదితర సదుపాయాలను సమగ్ర ప్రణాళికతో ఏర్పాటు చేయాలని సూచించారుఅన్ని గదుల్లో ఆమోదిత లేఅవుట్‌కు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు.


పెండింగ్ పనులను సంబంధిత విభాగాలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలనిప్రతి గదిలో రోగి సేవలకు అవసరమైన మెడికల్ మరియు సపోర్ట్ సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారుఅవసరమైతే ప్రముఖ ఆసుపత్రులలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై నివేదికలు సేకరించి అమలు చేయాలని సూచించారు.


అనంతరం నూతన భవనంలోని 6 అంతస్తు గదులుపై అంతస్తులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారుఅనంతరం ఆసుపత్రి సమీపంలో అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.


 కార్యక్రమంలో సిఈ శ్రీ టి.వి. సత్యనారాయణఆసుపత్రి డైరెక్టర్ డాఎన్శ్రీనాథ్ రెడ్డిఎస్.ఈలు శ్రీ మనోహరంశ్రీ వేంకటేశ్వర్లుడిఈ శ్రీమతి సరస్వతిడిప్యూటీ ఈఈ శ్రీ హర్షవర్థన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments