తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.
మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్డ్ రైస్‌లో ఉదయం సెషన్లో 21 లాట్లు, మధ్యాహ్నం సెషన్లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని ఈ-వేలంలో ఉంచనున్నారు.
ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు, ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లకు విడివిడిగా మే 13వ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000/- ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429. అలాగే టిటిడి వెబ్సైట్ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.
.jpg)
No comments :
Write comments