3.5.26

మే 14న మిక్సిడ్‌ రైస్ ఈ - వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14 -వేలం ద్వారా విక్రయించనున్నారు.


మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్‌డ్‌ రైస్‌లో ఉదయం సెషన్‌లో 21 లాట్లుమధ్యాహ్నం సెషన్‌లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని -వేలంలో ఉంచనున్నారు.


 వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారుఉదయం మరియు మధ్యాహ్నం సెషన్‌లకు విడివిడిగా మే 13 తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000/- ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.


ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చుఫోన్: 0877-2264429. అలాగే టిటిడి వెబ్‌సైట్‌  www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

No comments :
Write comments