24.5.26

మే 24న వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam




నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 24 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8.15 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పవిత్ర కార్యక్రమం జరుగనుంది.


మే 28 నుండి జూన్ 5 తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ పవిత్రత, శోభను మరింత పెంపొందించే ఉద్దేశంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.


సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి జలాలతో పరిశుభ్ర్రం చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.


కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.


No comments :
Write comments