VIDEO
వేదఘోషలు
, మంగళవాయి ద్యాలు , భక్తుల గోవింద నామస్ మరణల నడుమ తిరుపతి శ్రీ గోవిం దరాజస్వామివారి వార్షిక బ్రహ్మో త్సవాలు శనివారం ఉదయం మిథున లగ్ నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వై భవంగా ప్రారంభమయ్యాయి . ఉదయం 7. 35 నుండి 8.49 గంటల మధ్య గరుడ చి త్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్ రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు . అనంతరం స్వామివారి ఆస్థానం ఘనం గా నిర్వహించారు .
అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమే త శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్ వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు వెండి తిరుచ్చిపై నాలు గు మాడ వీధుల్లో విహరించి భక్తు లకు దివ్య దర్శనమిచ్చారు. ఈ ది వ్య ఊరేగింపుతో బ్రహ్మోత్సవాల ఏ ర్పాట్లను స్వామివారే స్వయంగా ప ర్యవేక్షిస్తారనే ఆధ్యాత్మిక వి శ్వాసం భక్తులను అలరించింది.
అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరా ధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం తది తర వైదిక కార్యక్రమాలను నిర్వహిం చారు. మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వా నించారు.
తదనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిం దరాజస్వామివారి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్ వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అ భిషేకాలు నిర్వహించగా భక్తులు భ క్తి పరవశులయ్యారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పె ద్దశేష వాహనసేవ వైభవంగా జరుగనుం ది. పెద్దశేష వాహనంపై స్వామివా రు మాడవీధుల్లో విహరించి భక్తు లను అనుగ్రహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్, రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలు, ఆకర్షణీ య పెయింటింగ్స్, పుష్పాలం కరణలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మి క శోభతో తీర్చిదిద్దింది.
అదేవిధంగా టీటీడీ హిందూ ధర్మప్ రచార పరిషత్, అన్నమాచార్య ప్రా జెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సం గీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కా ర్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డి ప్యూటీ ఈవో శ్రీమతి వి. ఆర్. శాం తి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి , సూపరింటెండెంట్లు శ్రీ శేషగి రి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, శ్ రీ రంజిత్ , అర్చకులు, ఇతర అధి కారులు పాల్గొన్నారు.
No comments :
Write comments