టీటీడీ
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి.
బుధవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ట్రస్టీ శ్రీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు.
ఈ సందర్భంగా దాత శ్రీ అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ సదాశివరావు, శ్రీ జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ శ్రీ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments