7.5.26

అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞాన సారాంశం : డా|| జయమ్మ anamaya



 తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేదాల సారాంశంభక్తి తత్త్వం సమన్వయమై ఉన్నాయని తిరుపతికి చెందిన డా|| జయమ్మ తెలిపారుఅన్నమాచార్యుల 618 జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాహితీ సదస్సు భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది.


 సందర్భంగా డా|| జయమ్మ “అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు” అనే అంశంపై మాట్లాడుతూశరణాగతి తత్త్వంలోకనీతివేద విజ్ఞాన సారం అన్నమయ్య సాహిత్యంలో ప్రతిఫలించాయని వివరించారుశ్రీ వేంకటేశ్వర స్వామి నామంలోనే సమస్త మంత్రాల సారం నిక్షిప్తమై ఉందని ఆమె పేర్కొన్నారు.


పుత్తూరుకు చెందిన డా|| నరసింహులు “అన్నమయ్య జీవితం – సందేశం” అనే అంశంపై మాట్లాడుతూఅన్నమయ్య జీవితం భక్తిసమానత్వంమానవత్వానికి ప్రతీకమని తెలిపారుఆయన సంకీర్తనలు ప్రతి మనిషిని ధర్మమార్గంలో నడిపించే దివ్య మార్గదర్శకాలు అని పేర్కొన్నారు.


డా|| శైలేశ్వరి “అన్నమయ్య సంకీర్తనలు – సంగీతం” అనే అంశంపై మాట్లాడుతూఅన్నమయ్య సులభమైన పదాలతో భక్తి సంగీతాన్ని ప్రజలకు చేరువ చేసి ఆధ్యాత్మికతను విస్తరింపజేశారని చెప్పారుఆయన సంకీర్తనలు నేటికీ ఆలయాల్లో మార్మోగుతూ భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాయని తెలిపారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాలతపెద్ద సంఖ్యలో భక్తులుసాహితీప్రియులు పాల్గొన్నారు.

No comments :
Write comments