9.5.26

అన్నమయ్య సూక్తులు జీవితానికి ఆధ్యాత్మిక మార్గదర్శకాలు : డా. హేమంత్ కుమార్ annamaya





తాళ్లపాక అన్నమాచార్యుల సూక్తులు భక్తినీతిమానవతా విలువలను ప్రజల్లో పెంపొందించే దివ్య సందేశాలని తిరుపతికి చెందిన డాహేమంత్ కుమార్ తెలిపారుఅన్నమాచార్యుల 618 జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం నిర్వహించిన సాహితీ సదస్సులు భక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి.


అన్నమయ్య సూక్తులు – జన జీవనం అనే అంశంపై మాట్లాడిన డాహేమంత్ కుమార్అన్నమయ్య కీర్తనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాకుండా మానవ జీవితానికి సన్మార్గం చూపే ఆధ్యాత్మిక సందేశాలని పేర్కొన్నారుఆయన రచనల్లో ధర్మంనీతిసత్యంసమాజ సంస్కరణ వంటి విలువలు ప్రతిబింబించాయని చెప్పారు.


తాళ్లపాక కవులు – తిరుమల కైంకర్యాలు” అనే అంశంపై తాళ్లపాక వంశీయులు శ్రీ హరినారాయణాచార్యులు మాట్లాడుతూఅన్నమయ్య మరియు వారి వంశస్థులు జీవితాంతం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవకే అంకితమయ్యారని తెలిపారుసంకీర్తనల ద్వారా శ్రీనివాసుని మహిమను ప్రపంచానికి చాటిచెప్పారని వివరించారు.


అన్నమయ్య సంకీర్తనలు – ఆధ్యాత్మికత” అనే అంశంపై డావాసుదేవ రావు మాట్లాడుతూఅన్నమయ్య సంకీర్తనలు ప్రజలను భక్తివైరాగ్యంమోక్ష మార్గం వైపు నడిపించే దివ్య గానమని చెప్పారుభక్తి ద్వారా వేదాంతాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అని కొనియాడారు.


సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో సంగీతనృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డామేడసాని మోహన్సంచాలకులు శ్రీమతి లతపెద్ద సంఖ్యలో భక్తులుసాహితీప్రియులు పాల్గొన్నారు.


No comments :
Write comments