9.5.26

గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీ వేదనారాయణస్వామివారి రథోత్సవం




నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం జరిగిన రథోత్సవం భక్తి పారవశ్యంలో అంగరంగ వైభవంగా జరిగిందిగోవింద నామస్మరణలుమంగళ వాయిద్యాలుభజనల డుమ స్వామివారి రథయాత్ర గ్రామ వీధులను ఆధ్యాత్మిక కాంతులతో నింపింది.


ఉదయం 6.25 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారు మహారథాన్ని అధిష్ఠించి నాలుగు మాడ వీధుల్లో విహరించారుడప్పు వాయిద్యాలుకోలాటాలుభజ బృందాల నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. “గోవిందా… గోవిందా…” నామస్మరణల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు.


అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేదపారాయణంప్రబంధంశాత్తుమొర నిర్వహించి మహాహారతి సమర్పించారు.


రథోత్సవం ఆధ్యాత్మికంగా విశిష్టమైన తత్త్వాన్ని తెలియజేస్తుందిశరీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలుఆత్మ రథికుడనే భావన ద్వారా ఆత్మానాత్మ వివేకాన్ని  ఉత్సవం భక్తులకు బోధిస్తుంది.


అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారుఅమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారురాత్రి 7.30 గంటలకు అశ్వవాహన సేవ జరగనుంది.


 కార్యక్రమంలో ఆలయ అధికారులుసూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డిటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్ రాయులు తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


మే 9 చక్రస్నానం


బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుందిరాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


No comments :
Write comments