2.5.26

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ garuda seva




తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగిందిరాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై లయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.


గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం


పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందిగరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారుఅంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


 వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిటీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుడిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంతోఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు

No comments :
Write comments