31.5.26

గరుడునిపై విహరించిన వేదనారాయణుడు నాగలాపురంలో వైభవంగా కంచి గరుడసేవ garuda vahanam




నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో శనివారం కంచి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచిపురంలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో రిగే ప్రసిద్ధ గరుడసేవను పురస్కరించుకుని, శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.


సందర్భంగా సర్వాలంకార భూషితుడైన శ్రీ వేదనారాయణస్వామివారు దయం గరుడవాహనంపై గ్రామవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గరుడునిపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన దివ్యోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.


కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఆల అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments