VIDEO
హర్యానా రాష్ట్రం లోని పుణ్యక్షేత్రమైన కురుక్షే త్ర శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 25 నుండి జూలై 3 వ తేదీ వరకు అత్యం త వైభవంగా జరగనున్నాయి . బ్రహ్మో త్సవాలకు ముందుగా జూన్ 24 న సాయం త్రం 6 గంటలకు అంకురార్పణ నిర్ వహించనున్నారు .
బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా జూ న్ 19 న కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తా రు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గం ధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సు గంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవి త్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్ షణం చేస్తారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వి వరాలు
జూన్ 25 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ధ్ వజారోహణం నిర్వహించి, సాయంత్రం పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తు లకు దర్శనమిస్తారు.
జూన్ 26 – చిన్నశేష వాహనం, హంస వాహనం
ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంస వాహనంపై స్వామివారి దివ్య వి హారం జరుగుతుంది.
జూన్ 27 – సింహ వాహనం, ముత్యపుపందిరి వా హనం
ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్ యపుపందిరి వాహన సేవలు నిర్వహిస్ తారు.
జూన్ 28 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వా హనం
భక్తుల కోర్కెలను తీర్చే కల్పవృ క్ష వాహనం, అనంతరం సర్వభూపాల వా హన సేవలు జరుగుతాయి.
జూన్ 29 – మోహినీ అవతారం, కల్యాణోత్సవం, గరుడ వాహనం
ఉదయం మోహినీ అవతారంలో స్వామివా రు దర్శనమివ్వగా, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటే శ్వరస్వామివారి కల్యాణోత్సవం వై భవంగా నిర్వహిస్తారు. అనంతరం గరు డ వాహన సేవ జరుగుతుంది.
జూన్ 30 – హనుమంత వాహనం, గజ వాహనం
ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వా హనంపై స్వామివారు భక్తులను అను గ్రహిస్తారు.
జూలై 1 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వా హనం
ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్ రభ వాహనాలపై దివ్య దర్శనం కల్పి స్తారు.
జూలై 2 – రథోత్సవం, అశ్వ వాహనం
భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ర థోత్సవం నిర్వహించి, రాత్రి అశ్ వవాహనంపై స్వామివారు విహరిస్తా రు.
జూలై 3 – చక్రస్నానం, ధ్వజావరోహణం
పవిత్ర చక్రస్నానంతో పాటు ధ్వజా వరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవా లను ముగిస్తారు.
జూలై 4 న పుష్పయాగం
బ్రహ్మోత్సవాల అనంతరం జూలై 4 న సా యంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వ రకు పుష్పయాగం వైభవంగా నిర్వహి స్తారు.
భక్తులకు ఆహ్వానం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 .30 నుండి 8.30 గంటల వరకు వా హనసేవలు జరుగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టి టిడి కోరుతోంది.
No comments :
Write comments