ప్రపంచ
రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 52 మంది భక్తులు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌరి, హెడ్ నర్స్ శ్రీమతి పుష్ప, బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ నర్స్ శ్రీమతి విజయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ కోదండపాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments