15.6.26

ధ్వజావరోహణంతో వైభవోపేతంగా ముగిసిన శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తుల గోవిందనామ స్మరణల మధ్య సాగనంపిన దేవతాగణాలు dhwajavarohanam



కార్వేటినగరం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.


సాయంత్రం 5.30 గంటలకు వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ ధ్వజావరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన సకల దేవతలను రుడ పటాన్ని అవనతం చేసి గౌరవప్రదంగా సాగనంపారు.


దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు పాప విముక్తులై, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధిని పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.


కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments