22.6.26

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం donation





టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు హైదరాబాద్లోని షేక్పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.

మేరకు విరాళానికి సంబంధించిన డిడిని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు అందించారు.

సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత శ్రీ అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు.

కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఎన్. సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

No comments :
Write comments