కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ యోగనారాయణుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.
యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, ధైర్యానికి, శీఘ్రగమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తిశ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే స్వామివారు రాక్షసుల హృదయాలలో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతారని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది.
ఈ సందర్భంగా జరిగిన వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించి పరవశించారు.
No comments :
Write comments