VIDEO
తిరుపతి
శ్రీ గోవిం దరాజస్వామివారి వార్షిక బ్రహ్మో త్సవాలు ఆదివారం ఉదయం అత్యంత వై భవంగా నిర్వహించిన చక్రస్నాన మహో త్సవంతో పరమపవిత్రంగా ముగిశాయి . కపిలతీర్థం ఆళ్వార్ తీర్థం వద్ద జరిగిన ఈ దివ్య ఘట్టాన్ని వేలా ది మంది భక్తులు భక్తి శ్రద్ ధలతో వీక్షించి పుణ్యఫలాన్ని పొం దారు .
ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు , చక్రత్తాళ్వార్ ఆలయం నుండి మం గళవాద్యాలు, వేదఘోషలు, గోవింద నా మస్మరణల మధ్య ఊరేగింపుగా బయలుదే రి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీ ర్థానికి విచ్చేశారు. మార్గమధ్ యంలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తి రుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. పాలు, పెరుగు, తేనె, చం దనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకా ల పండ్లరసాలతో జరిగిన అభిషేకం ఆ ధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిం చింది.
తదనంతరం చక్రత్తాళ్వార్‌కు వై భవంగా చక్రస్నానం నిర్వహించగా, తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరిం చిన భక్తులు అపార భక్తి పారవశ్ యంలో మునిగిపోయారు. అనంతరం స్వా మివారు టీటీడీ పరిపాలనా భవనం ఎదు టనున్న పి. ఆర్. తోటకు వేంచేశారు .
సాయంత్రం 5 గంటలకు పి. ఆర్. తోట నుండి స్వామివారు ఊరేగింపుగా బయ లుదేరి శ్రీ గోవిందరాజస్వామి ఆల యానికి చేరుకుంటారు. రాత్రి 7 గం టల నుండి 8 గంటల వరకు బంగారు తి రుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్ లో భక్తులకు దివ్య దర్శనమివ్వను న్నారు.
రాత్రి 8.40 గంటల నుండి 9.30 గం టల వరకు నిర్వహించే ధ్వజావరోహణ మహోత్సవంతో ఈ ఏడాది బ్రహ్మోత్ సవాలు అధికారికంగా ముగియనున్నా యి.
ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల శ్రీ శ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, డి ప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెం డెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇ న్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరు లు పాల్గొన్నారు.
No comments :
Write comments