22.6.26

యోగతో శారీరక దృఢత్వం – మానసిక వికాసం – అంతరంగ ప్రశాంతత - ttd eo











అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా టిటిడి పరిపాలనా భవనం వెనుకనున్న పరేడ్ మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన యోగ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర పాల్గొని యోగ ప్రాముఖ్యతను వివరించారు.


సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసి వికాసం, ప్రశాంతతను పెంపొందించుకోవచ్చని తెలిపారు. శ్రీవారి సేవలో నిత్యం నిమగ్నమై లక్షలాది మంది భక్తులకు సేవలందించే టిటిడి ఉద్యోగులు యోగను అలవర్చుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జీవితం గడపడంతో పాటు వారి కుటుంబాల్లోనూ సంతోషం వెల్లివిరుస్తుందన్నారు.

గత 14 రోజులుగా క్రమశిక్షణతో యో సాధన చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఈవో ప్రత్యేకంగా అభినందించారు. తాను కూడా ఒకప్పుడు బలవంతంగా యోగ ప్రారంభించినప్పటికీ, అది క్రమంగా అలవాటై ఆరోగ్యవంతమై జీవనశైలికి దారి తీసిందని తన అనుభవాన్ని పంచుకున్నారు.


14 రోజుల యోగ శిక్షణకు విశేష స్పందన


టిటిడి జేఈవో డా. . శరత్ మాట్లాడుతూ, గతంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఒక రోజు మాత్రమే నిర్వహించేవారని, ఈవో శ్రీ ముద్దా రవిచంద్ర ఆదేశాల మేరకు జూన్ 7 నుండి 21 వరకు 14 రోజుల పాటు టిటిడి సంస్థల్లో విస్తృత స్థాయిలో యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులందరూ ఇదే స్ఫూర్తితో యోగను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.


ధ్యాన మూలమిదం జగత్సీడీ, పుస్తకావిష్కరణ, స్విమ్స్ వారు రూపొందించిన బ్రోచర్ ను టిటిడి ఈవో ఆవిష్కరించారు

కార్యక్రమానికి ముందు పూజా కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలనతో యోగ దినోత్సవాన్ని ప్రారంభించారు. నంతరంధ్యాన మూలమిదం జగత్”, “యోగఒక పరిచయంసీడీ మరియు పుస్తకాన్ని ఈవో ఆవిష్కరించారు


ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన యోగాసనాలను అధికారులు, సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా అభ్యసించారు.

గత 14 రోజుల యోగ శిక్షణలో ప్రతి కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఈవో ప్రశంసా పత్రాలు అందజేశారు. టిటిడి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పీఆర్వో (ఎఫ్‌ఏసీ) కుమారి నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


కార్యక్రమంలో టిటిడి బోర్డు భ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ న్‌చార్జి కార్యదర్శి డా. మేడసాని మోహన్, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, స్విమ్స్ డైరెక్టర్ డా ఆర్వీ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


No comments :
Write comments