న్యూఢిల్లీలో
ని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డి, ఏఈవో శ్రీ బాలరాజు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్, శ్రీ ఉదయ్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.
మే 1న ధ్వజారోహణం :
మే 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
వాహన సేవల వివరాలు
01-05-2026 – ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం
02-05-2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
03-05-2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
04-05-2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
05-05-2026 – ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం
06-05-2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
07-05-2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
08-05-2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
09-05-2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులను కోరుతున్నారు.