21.5.26

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ brahmotsavams





నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర బుధవారం తిరుపతిలోని ఈవో నివాస గృహంలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

భక్తులకు దివ్యానుభూతి కలిగేలా ఏర్పాట్లు : టీటీడీ ఈవో

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 27న అంకురార్పణం, జూన్ 4న దివ్య కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలకు సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఏర్పాట్లు చేపట్టాలని, భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్, ఆలయ పరిసరాల్లో ఆహ్లాదకర రంగోలీలు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సాంప్రదాయ పెయింటింగ్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని సూచించార.

వాహన సేవలు

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు, అమ్మవారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులకు అనుగ్రహ దర్శనం ఇవ్వనున్నారు.

మే 28 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం

మే 29 – చిన్నశేష వాహనం, హంస వాహనం

మే 30 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

మే 31 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం

జూన్ 1 – మోహినీ అవతారం, గరుడ వాహనం

జూన్ 2 – హనుమంత వాహనం, గజ వాహనం

జూన్ 3 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

జూన్ 4 – రథోత్సవం, అశ్వవాహనం, కల్యాణోత్సవం

జూన్ 5 – చక్రస్నానం, ధ్వజావరోహణం

జూన్ 4న వైభవంగా శ్రీ స్వామివారి కల్యాణోత్సవం

జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు నిర్వహించే శ్రీ స్వామివారి కల్యాణోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు. కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల పంపిణీ, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

20.5.26

Sri Vedanarayaan Swamy Vari Kanchi Garuda Seva on 30th May




The divine Kanchi Garuda Seva of Sri Vedanarayana Swamy will be observed grandly on May 30 at Nagalapuram temple.


As part of the tradition connected with the Garuda Seva at Sri Varadaraja Swamy Temple in Kanchi, the event will be conducted at Nagalapuram temple every year.


On this occasion, the deity will take a procession on Garuda Vahanam in the four Mada streets from 6.30 am to 8.30 am and bless devotees.


Temple officials appealed to devotees to participate in large numbers and receive the blessings of the Lord.


మే 30న నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామివారి దివ్య కంచి గరుడసేవ




భక్తులను క్తి పారవశ్యంలో ముంచెత్తే శ్రీ వేద నారాయణ స్వామివారి కంచి గరుడసేవ మే 29 నాగలాపురం ఆలయంలో వైభవంగా జరగనుంది. కంచిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే మహా గరుడసేవను పురస్కరించుకొని నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ వేద నారాయణ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మా వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి దివ్య మంగళ విహారాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు.

TTD E-Auction of Clothes from 21st May to 2nd June




TTD will conduct an e-auction of clothes offered by devotees at Tirumala Srivari Temple and other TTD temples from May 21 to June 2.


A total of 505 lots, including new, used and partially damaged clothes, will be auctioned. The items include sarees, shawls, lungis, bed sheets, towels, dress materials, carpets, blankets, curtains, umbrellas and other cloth items.


For details, devotees may contact TTD Marketing Office, Tirupati on 0877-2264429 or visit www.konugolu.ap.govt.in  / www.tirumala.org


మే 21 నుండి జూన్ 2 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మే 21 నుండి జూన్ 2 తేదీ వరకు -వేలం ద్వారా విక్రయించనున్నారు.


వేలంలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి ఉన్నాయి.


ఆసక్తి గల వారు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించవచ్చు. అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.konugolu.ap.govt.in  / www.tirumala.org  సంప్రదించగలరు.


19.5.26

Donaltion of ₹50 Lakhs to TTD




Smt Swati N.V. and Sri C.A. Srinivasa Sastry from Bengaluru donated Rs. 50,00,101 to the TTD Sri Venkateswara Veda Parirakshana Trust on Monday.


The donors handed over the donation cheque to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.


టీటీడీకి రూ.50 లక్షలు విరాళం donation




బెంగుళూరుకు చెందిన శ్రీమతి స్వాతి ఎన్.వి, శ్రీ సి..శ్రీనివాస శాస్త్రీ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.50,00,101 విరాళంగా అందించారు.


ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.