9.5.25

buragamanda Brahmotsavams Begin with Dhwajarohanam




The annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy located at Buragamanda village in Sadum Mandal of Chittoor district commenced grandly on Thursday with the traditional Dhwajarohanam ritual.

Under the supervision of Kankanabhattar Sri Vishnukanta Swamy, special rituals were performed to Garudalwar on the temple's Dhwajasthambham, including Abhishekam, Dhupa Deepa Naivedyam, Darbha Alankaram, followed by the hoisting of the sacred Dhwaja Patam.
As part of the Brahmotsavams, Tiruchi Utsavam will be held every morning at 9 AM and Vahana Sevas every night at 8 PM. On May 17th at 5 PM, the temple will host the Pushpayagam ritual.
Deputy EO Smt. Shanti, AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Nagendra Prasad, and Temple Inspector Sri Rajesh participated in the inaugural event.

ధ్వ‌జారోహ‌ణంతో ప్రారంభ‌మైన బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు




చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి.

కంకణ భట్టర్ శ్రీ విష్ణుకాంత స్వామి ఆధ్వర్యంలో ఆలయ ధ్వజస్థంభంపై ఉన్న గరుడాళ్వార్ స్వామికి అభిషేకం, ధూప దీప నైవేద్యాల సమర్పణ, దర్భాలంకరణ, ధ్వజపటారోహణ నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 17వ తేదీన సాయంత్రం 5 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర ప్రసాద్, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ రాజేశ్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు :
09-05-2025 – సాయంత్రం – శేష వాహనం.
10-05-2025 – సాయంత్రం – హంస వాహనం.
11-05-2025 – సాయంత్రం – హనుమంత వాహనం.
12-05-2025 – సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం.
13-05-2025 – సాయంత్రం – పుష్ప పల్లకి.
14-05-2025 – సాయంత్రం – సింహ వాహనం.
15-05-2025 – సాయంత్రం – అశ్వవాహనం.
16-05-2025 – ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – గజ వాహనం, ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Ankurarpanam on 10th May for Brahmotsavams at Nrayanavanam




The Ankurarpana for the annual Brahmotsavams scheduled from May 11 to 19 at Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, will be performed on May 10.

As part of this ritual, Punyahavachanam, Mritsangrahanam, Senadhipati Utsavam, and Ankurarpana will be conducted in a traditional manner from 7:30 PM to 9:30 PM.

మే 10న నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌




నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మే 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించే బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 10న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు పుణ్యాహ వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

Sridevi in Jagadeka Veerudu Athiloka Sundhari Movie














 

చిరుజల్లుల మధ్య వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు










•⁠ భక్తులను విశేషంగా ఆకట్టుకున్న భక్తి వాద్య సంగీతం
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు గురువారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిసాయి.
సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు.
తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ లోకనాథరెడ్డి, శ్రీమతి లావణ్య 
బృందం పసిడి అక్షింతలవి..., చూడరమ్మ సతులాల, తెలిసిన వారికి దేవుడితడే..., తదితర అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యకమంలో టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు, ఈవో శ్రీ జెశ్యామలరావు దంపతులు, శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Padmavati Ammavari Parinayam Concludes














The three day annual Padmavati Parinayam concluded on a grand religious note on Thursday evening amidst heavy down pour at Tirumala.

Sri Malayappa Swamy reached the wedding venue on Garuda Vahanam while Sridevi and Bhudevi on separate Tiruchis. The celestial wedding ceremony concluded on Suddha Ekadasi Tithi.
After a series of traditional events like Chaturveda Paarayanam-Raga-Tala-
Sangeeta programs, in the presence of the finely decked Utsava murthies, the c