చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీవారి సారెను అందజేశారు.
కుప్పం జాతర సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరుపున సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో కలిసి చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మంచి జరగాలని ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రార్థించారు. ఏడాదికోసారి మాత్రమే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్ పాల్గొన్నారు.
On the occasion of the Prasanna Tirupati Gangamma Jatara held in Kuppam, Chittoor district, TTD Chairman Sri B.R. Naidu presented the traditional Sare of Sri Venkateswara through the hands of Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, on Wednesday.
TTD offered the sacred Sare to Goddess Gangamma in view of the annual jatara in Kuppam.
On this occasion, the Chief Minister along with his spouse, and the TTD Chairman and his spouse, participated in special pujas.
Later, they had the divine Vishwaroopa Darshanam of the Goddess.
Speaking on the occasion, both the Hon’ble Chief Minister and the TTD Chairman prayed for the well-being and prosperity of the state.
Thousands of devotees gathered to witness the rare Vishwaroopa Darshanam of the Goddess, which is granted only once a year.
TTD Board Member Sri Shanta Ram also participated in the program.
పలమనేరులోని టిటిడి గోశాలలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు బుధవారం ఆకస్మిక పరిశీలన చేపట్టారు. పలమనేరులో 450 ఎకరాలలో టిటిడి స్వదేశీ గో సంవర్థ సంస్థ 500 గోవులతో గోశాల నడుస్తోంది. గోవుల సంరక్షణ సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్రంగా పరిసరాలు ఉండడంపై టిటిడి ఛైర్మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల రోజువారి నిర్వహణపై వారం రోజులలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోశాలలోని గోవులకు టిటిడి ఛైర్మెన్ పశుగ్రాసం పెట్టారు. గోవులకు అందిస్తున్న దాణా, తాగునీరు, వైద్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
TTD Chairman Sri B.R. Naidu conducted a surprise inspection at the TTD Gosala located in Palamaner on Wednesday.
Spread across 450 acres, the TTD-run Swadeshi Go Samvardhana Trust currently houses around 500 cows.
Expressing displeasure over improper maintenance and unhygienic surroundings, the Chairman instructed officials to submit a detailed report on the daily operations of the Gosala within a week.
Later, the Chairman personally offered fodder to the cows and inquired with the staff about the availability and quality of feed, drinking water, and veterinary care being provided to the cattle.
TTD will conduct an online e-auction for 62 lots of used or partially damaged watches, which were offered by devotees as donations to the Tirumala Sri Venkateswara Temple and other affiliated temples.
The e-auction will take place from June 2 to June 3. The watches include brands such as Titan, Citizen, Sonata, Raga, Times One, Times, Timex, and others.
The e-auction will be conducted under EA ID Nos 25106, 25107, 25108, and 25109.
Interested bidders who are registered on the Andhra Pradesh Government e-Purchase Portal are eligible to participate in the auction.
For more details, interested individuals can contact the Local General Manager (Auctions) / AEO (Auctions), TTD, Hare Krishna Marg, Tirupati, through the websites https://konugolu.ap.gov.in or www.tirumala.org, or by calling 0877 - 2264429.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన / పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీలు జూన్ 02వ తేదీ నుండి 03వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ - వేలం వేయనున్నారు. వీటిలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమ్స్ వన్, టైమ్స్, టైమెక్స్ తదితర స్మార్ట్ వాచీలు EA ID Nos 25106, 25107, 25108, 25109 ద్వారా ఈ - వేలం వేయనున్నారు.
ఆసక్తి కల్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా www.tirumala.org లేదా ఫోన్ నెంబర్ 0877 - 2264429 ద్వారా సంప్రదించగలరు
నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలు రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో బుధవారం ఎస్వీబీసీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం, దాససాహిత్యం, టిటిడి భక్తులకు అందిస్తున్న సేవలు, సనాతన ధర్మ మూలాలను పిల్లలకు తెలిపేలా, టిటిడి ప్రచురించిన ప్రముఖ పుస్తకాల సారాంశాన్ని, స్ఫూర్తిదాయక కథలను నవతరానికి తెలియజేసేలా, భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆయన సూచించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం బాషలలో ఎస్వీబీసీ కార్యక్రమాలను రూపొందించి భక్తులకు అందిస్తోందని, నాలుగు భాషలలో వినూత్నంగా, సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మరింత నాణ్యంగా ప్రసారాలు అందించాలన్నారు. ఇప్పటికే ప్రసారం అవుతున్న కార్యక్రమాలపై విశ్లేషణ చేసుకుని, యువతను, మధ్య వయస్కుల వారిని, వృద్ధులను ఆకట్టుకునేలా సరికొత్త కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కార్యక్రమాల కల్పనలో నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచించారు.
తిరుమల, స్థానిక ఆలయాలలో సేవలు, కైంకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ముందస్తుగా ప్రోమోలను ప్రసారం చేయాలన్నారు. ప్రసార భారతిలో వేన్స్ లో ప్లేస్ మెంట్ తీసుకుని నాలుగు ఛానళ్ల ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీ, యూట్యూబ్, ఆన్ లైన్ రేడియో ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారంతో పాటు స్వామి కైంకర్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను అందించాలన్నారు. ఎస్వీబీసీ ఛానల్స్ లలో హెచ్.డి క్వాలిటీతో ప్రసారం చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వర్చువల్ గా అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్ డి శ్రీమతి కె. పద్మావతి, ఎస్వీబీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.