29.5.25

జూన్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు Sri Kodanda Rama Swamy Vari Temple




జూన్ 07, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు


జూన్ 11వ  తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగింపు  

జూన్ 25న అమావాస్య సందర్భంగా ఉ. 8.00 గం.లకు సహస్రకలశాభిషేకం, సా. 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగింపు  

జూన్ 27న  పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు  శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 5.30 గం.లకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం  

Special Festivals in the Month of June At Sri Kodanda Rama Swamy Vari Temple




Following are the special religious events scheduled at the Sri Kodandarama Swamy Temple, Tirupati, during June,


June 7,14,21,28 (Saturdays)

6 AM: Abhishekam to the presiding deities

5 PM: Procession of the Utsava Murthies of Sri Rama and Sita around the Mada Streets.

June 11: on the occasion of Pournami at 8.30 AM Ashtottara Shata Kalasha Abhishekam.

5.30 PM: Procession of Sri Kodandarama along with Sita Devi and Lakshmana Swamy on Tiruchi.

June 25: on the occasion of Amavasya at 8 AM Sahasra Kalasha Abhishekam and 7 PM Sri Kodandarama Swamy procession on Hanumantha Vahanam.

June 27: in view of Punarvasu Nakshatram Sri Sita Rama Kalyanam at 11am

5:30 PM: Tiruchi 

జూన్ నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు




జూన్ 11వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం 

జూన్ నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
జూన్ 03న పుబ్బ నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం
జూన్ 04న ఉత్తర నక్షత్రం, సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు గ్రామోత్సవం
జూన్ 15న  శ్రవణా నక్షత్రం, ఉ. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.05 గం.లకు గ్రామోత్సవం
జూన్ 27న పునర్వసు నక్షత్రం, మ.3.30 గం.లకు స్నపనం, సా.5.గం.లకు గ్రామోత్సవం
ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం

Vontimitta Sri Kodandarama Swmay Vari Temple




On June 11, on the occasion of Pournami Sri Sitarama Kalyanotsavam, will be held at 9.30 AM.


Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa:

On June 3, on the occasion of Pubba Nakshatram, Snapanam will be performed at 3.30 PM, followed by Gramotsavam at 5 PM.

On June 4, on Uttara Nakshatram, Snapanam at 3.30 PM, and Gramotsavam at 5 PM.

On June 15, on Sravana Nakshatram, Kalyanotsavam at 10 AM, and Gramotsavam at 5 PM.

On June 27, on Punarvasu Nakshatram, Snapanam at 3.30 PM, and Gramotsavam at 5 PM.

Every Saturday, Gramotsavam will be performed at 5 PM to Sri Venkateswara Swamy along with Sri Devi and BhuDevi.

TTD Chairman Invited to Sri Govindaraja Swamy Vari Brahmotsavams



TTD Chairman Sri B.R. Naidu was extended an invitation on Wednesday to the annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple in Tirupati, scheduled to be held from June 2 to June 10.

The invitation was extended at the Chairman's Camp Office in Tirumala, where temple priests offered Vedic blessings.
On this occasion, the Chairman emphasized that the Brahmotsavams should be conducted with grandeur, ensuring that devotees and residents do not face any inconvenience.
Deputy EO Smt. Shanti, temple priests, and other officials participated in the event.

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం






జూన్ 2 నుండి 10వ తేది వరకు నిర్వహించనున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు.


తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ కు అర్చకులు వేద ఆశీర్వచనం చేసారు. 

ఈ సందర్భంగా చైర్మన్ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన టిటిడి ఈవో SVIMS






స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనాలను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని రోగులు వేచియుండే గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడే వున్న రోగులతో అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. స్విమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు. రోగులు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎలాంటి వైద్యం కోసం వచ్చారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం  కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటి సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏ ఏ శాఖను ఏర్పాటు చేస్తారు, సదరు శాఖను నూతన భవనంలోకి తరలిస్తే, అప్పటి వరకు ఉన్న పాత భవనాన్ని ఏ శాఖకు కేటాయిస్తారనే విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. ఇన్ పేసెంట్స్ రినోవేషన్ బ్లాక్ ను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ భవనాలను, స్విమ్స్ శ్రీ పద్మావతీ ఆసుపత్రిని, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ , స్టాప్ క్వార్ట్స్ ను, శ్రీపద్మావతీ చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. నిర్మాణంలోని భవనాలు, మౌళిక సదుపాయాలు, పరికరాల వివరాలు, తదితర అంశాలపై  సమగ్ర నివేదిక తయారు చేసి నివేదించాలని  అధికారులను ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ ప్రొ. ఆర్వీ కుమార్, మెడికల్ సూపరింటెండ్ డా. రామ్, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎస్.ఈలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు.